పర్వతగిరి మండలం పెద్దతండ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాదావత్ రాజు ఇటీవల కాకతీయ యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసి, గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా స్వేరోస్ మండల కమిటీ ఆయనకు ఘనంగా సత్కారం చేసింది. విద్యార్థులకు బోధన చేస్తూనే, సమాజానికి సేవలందిస్తూ పీహెచ్‌డీ పూర్తిచేయడం అభినందనీయమని నేతలు ప్రశంసించారు.