ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి: సర్పంచ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు, గ్రామాల్లో, పట్టణాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండలం నాగారం గ్రామ సర్పంచ్ శ్రీమతి సందరాజు రాజు లావణ్య సంతోష్ మాట్లాడుతూ, పుట్టిన పసి గుడ్డు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంపై జాగ్రత్తగా ఉండాలని కోరారు. 'నిండు జీవితానికి రెండు చుక్కలు' అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్