సివిల్ సప్లైలో పనిచేస్తున్న హమాలీలు తమ కూలి రేట్లు పెంచాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గోదాముల ముందు ఆందోళన చేపట్టారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి రేట్లు పెంచే విధానాన్ని ప్రభుత్వం పాటించడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు. సివిల్ సప్లై హమాలీలను ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.