మడికొండ డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ యంత్రం ప్రారంభం

కాజీపేట మండలం మడికొండ-రాంపూర్ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ యంత్రాన్ని మంగళవారం రోజు వరంగల్ మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధ్యక్షతన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. ఈ యంత్రం రోజుకు 1000 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్