వరంగల్ వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెం గ్రామానికి చెందిన గాదె శ్యామ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ను రాత్రి సమయంలో ఇంటి ముందు రోడ్డుపై పార్కింగ్ చేశారు. అందరూ నిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి స్కూటర్ను దొంగలించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనంతో శ్యామ్ కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.