వరంగల్ ఏనుమాముల బాలాజీనగర్ చౌరస్తాలో వృద్ధురాలి హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు గౌడ సదానందంను పోలీసులు పట్టుకున్నారు. గిర్మాజిపేట్లో అద్దె ఇంట్లో నివసిస్తూ ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్న సదానందం, తన మేనత్త గౌడ స్వరాజ్యం (85) ఆస్తిని కాజేయాలనే దురుద్దేశంతో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె కాలు విరగడంతో బాగోగులు చూసుకోలేక వదిలించుకోవాలని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు.