రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు: క్రీడాకారులకు రాకేష్ రెడ్డి అభినందనలు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్ స్కూల్ లో 44 వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు జరగడం గర్వకారణమని బిఆర్ యస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఈ పోటీలు రాష్ట్ర పండుగ వాతావరణాన్ని సృష్టించాయని, క్రీడాకారులతో పాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం కూడా ఇక్కడ కనిపిస్తుందని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఐలయ్య, పల్లవి మోడల్ స్కూల్ చైర్మన్ అశోక చారి లను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్