పెంకుటిల్లు కూలి ఇంట్లో నిద్రిస్తున్న సూరమ్మ మృతి

హనుమకొండ జిల్లాలో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో పెంకుటిల్లు కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న సూరమ్మ అనే మహిళ మృతి చెందింది. శిథిలాల కింద చిక్కుకున్న ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ విషాద సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

సంబంధిత పోస్ట్