వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో జాతీయ రహదారిపై స్కూటీపై వెళ్తున్న తల్లి, కూతురిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో దరవత్ భారతి, ఆమె కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.