'ఉమానాగ్ పాలిమర్స్' పై టాస్క్‌ఫోర్స్ కొరడా

వరంగల్ ఏనుమాముల మార్కెట్ సమీపంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తున్న మరియు నిల్వ ఉంచిన 'ఉమానాగ్ పాలిమర్స్' కంపెనీపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12,00,000/- విలువ గల నిషేధిత ప్లాస్టిక్ గ్లాసుల ఉత్పత్తులు, ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు కంపెనీ నిర్వాహకుడు తోట ప్రసాద్ కు రూ. 50,000/- జరిమానా విధించడంతో పాటు, యూనిట్‌కు నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్