వరంగల్: పాత మున్సిపల్ కార్యాలయంలో తాత్కాలిక మున్సిఫ్ కోర్టు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు కోసం పాత మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా జడ్జ్ నిర్మల గీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాశ్వత నూతన భవనాలు నిర్మించే వరకు పట్టణ కేంద్రంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో తాత్కాలిక మున్సిఫ్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్, తహసిల్దార్ విజయసాగర్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్