వరంగల్ ఏనుమాములలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సోమవారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 400 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగిందని అన్నారు.