వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.