శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదిన వేడుకల సందర్భంగా "శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని" పేరుతో దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ రథయాత్ర హన్మకొండ జిల్లాలోని మడికొండ గ్రామానికి చేరుకుంది. ఏప్రిల్ 2025లో పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర, 18 నెలల పాటు కొనసాగి నవంబర్ 2026లో ముగుస్తుంది. ఈ యాత్ర మొత్తం 5 జోన్లలో, సుమారు 30,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి సత్యసాయి బాబా సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది. 2026 సంవత్సరమంతా వివిధ జిల్లాల నుండి భక్తులు పుట్టపర్తికి వెళ్లే "పార్థి యాత్రలు" కూడా షెడ్యూల్ చేయబడ్డాయి అని నిర్వాహకులు తెలిపారు. యాత్రలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా చిత్రపటం ముందు పూజలు నిర్వహించారు.