ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామానికి చెందిన సాంబయ్య (30) ఆదివారం హైదరాబాద్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ బోయినపల్లిలో జీవనం సాగిస్తున్న సాంబయ్య కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సాంబయ్యకు ఇద్దరు అక్కలు ఉన్నారు. సాంబయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.