తాను పాఠాలు బోధించిన విద్యార్థులకు పదవీ విరమణ చేసేలోపు తన వంతుగా సహకారం అందించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయురాలు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు ఇందిరా జయపాల్ రెడ్డి దంపతులు శుక్రవారం 74 మంది విద్యార్థులకు రూ. 30 వేల విలువచేసే వైట్ డ్రెస్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికిన హెచ్ఎం మహేశ్ అభినందించారు.