వర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు తీవ్ర గాయాలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ బస్టాండ్ సమీపంలోని భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా బుధవారం రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీను అనే వ్యక్తి బైక్ పై వెళుతుండగా కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. గాయాల పాలైన క్షతగాత్రుడిని వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్