వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు మంగళవారం 14 లక్షల 25 వేల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్న బాధితులు సీఎం, ఎమ్మేల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో ఆసరాగా నిలిచిందని వారు అన్నారు.