వర్ధన్నపేట నియోజకవర్గం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామం 46వ డివిజన్ లో లైట్స్ రావడంలేదని విద్యుత్ శాఖ సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని ఎన్నిసార్లు అడిగిన అది మా పరిధిలో లేదు అంటూ సిబ్బంది పనిచేయడంలేదు అని బాధితులు వాపోయారు. స్ట్రీట్ లైట్స్ సర్వీస్ లేకపోవడం వలన దొంగల భయం, కుక్కల భయం ఉంది అని ప్రజలు మీడియాతో తెలపడం జరిగింది. ఈ సమస్యపై సంబంధించిన అధికారులు స్పందించి పరిష్కరించగలరని విజ్ఞప్తి చేశారు.