కారు ఢీకొని వాటర్ మ్యాన్ మల్లయ్య మృతి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీ కార్యాలయానికి టీవీఎస్ పై వస్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న వాటర్‌మ్యాన్ మల్లయ్య (50) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనతో మున్సిపాలిటీ సిబ్బంది, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్