క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పట్ల యువత జాగ్రత్త:ఎస్ఐ

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం నేపథ్యంలో, మండలంలోని యువత నేరుగా లేదా ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్లకు పాల్పడవద్దని ఎస్ఐ సతీష్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈజీ మనీ ఆశతో యువత తమ జీవితాలను, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు యువతను అప్పుల పాలు చేస్తున్నాయని, లావాదేవీలు జరిపే వారిపై సైబర్ క్రైమ్, లోకల్ పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించే ముఠాలు, పందాలు కాసే వ్యక్తులపై నిఘా పెంచామని, పట్టుబడితే కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్పోర్ట్ వెరిఫికేషన్లలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ వాడకం, సంభాషణలపై నిరంతరం గమనించాలని, బెట్టింగ్ వ్యసనంలో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ సూచించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్