వాతావరణ మార్పులపై వార్నింగ్.. నగ్నంగా తలకిందులుగా వేలాడుతూ నిరసన (VIDEO)

వెనిస్ బియన్నాలేలో ఆస్ట్రియన్ కళాకారిణి ఫ్లోరెంటినా హోల్జింజర్ చేసిన వినూత్న ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ కాంస్య గంటలో నగ్నంగా, తలకిందులుగా వేలాడుతూ తన శరీరంతోనే గంటను మోగించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. వాతావరణ మార్పుల వల్ల సంభవించే వినాశనంపై హెచ్చరికగా, రాబోయే ప్రళయ సంకేతాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఈ సాహసోపేత ఆర్ట్ పెర్ఫార్మెన్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్