బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉంచడం సురక్షితమేనా?

వాషింగ్ మెషీన్లను బాల్కనీలో పెట్టడం చాలామందికి సౌకర్యంగా ఉన్నా, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మెషీన్ పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి, దుమ్ము, వర్షం వల్ల మెషీన్ లోని ప్లాస్టిక్ భాగాలు బలహీనపడటం, రంగు మారడం, ఓవర్ హీటింగ్ సమస్యలు తలెత్తవచ్చు. దుమ్ము వల్ల మోటార్, ఫిల్టర్లు బ్లాక్ అయి పనితీరు తగ్గుతుంది. వర్షంలో తడిస్తే షార్ట్ సర్క్యూట్, తుప్పు పట్టడం, మోటార్ కాలిపోవడం వంటి ప్రమాదాలున్నాయి. కాబట్టి బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉంచినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్