పీసీబీ మొండి వైఖరిపై వసీం అక్రం ఫైర్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మొండి వైఖరిపై మాజీ దిగ్గజ బౌలర్ వసీం అక్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో, వారికి సంఘీభావంగా పాక్ భారత జట్టుతో మ్యాచ్ ను బహిష్కరించాలని చూడటంపై అక్రం విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ తన ప్రయోజనాలను ఎందుకు పణంగా పెట్టాలని ఆయన ప్రశ్నించారు. కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ను బహిష్కరించడం వల్ల పాకిస్తాన్ ప్రపంచ క్రికెట్ వేదికపై ఏకాకిగా మారుతుందని, రాజకీయ డ్రామాలు జట్టుకు మేలు చేయవని హెచ్చరించారు. సొంత జట్టు అభివృద్ధిపై దృష్టి సారించాలని పీసీబీకి సూచించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒప్పందాలను ఉల్లంఘిస్తే నిషేధం విధించే అధికారం అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఉంది. రానున్న ఐసీసీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్