ప్రస్తుతం కాలంలో చాలా మంది రాత్రిళ్లు సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూస్తూ ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అయితే ఇది మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల చైనాలో దాదాపు 4 వేల మందిపై చేసిన అధ్యయనాల్లో యువత, మధ్య వయసు వారు రాత్రి వేళల్లో రీల్స్ చూడడం వల్ల రక్త పోటు వచ్చిందని తేలింది. అలాగే 20 నుంచి 40 ఏళ్ల వయస్కులు డిప్రెషన్‌కు గురయ్యే ఛాన్స్ కూడా ఉందని వెల్లడైంది.