కేసీఆర్ నివాసానికి నీటి సరఫరాపై జలమండలి స్పష్టత

TG: మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై జలమండలి వివరణ ఇచ్చింది. సాధారణ షెడ్యూల్ ప్రకారం నీటి సరఫరా జరుగుతోందని, అయితే సమావేశాలు లేదా రద్దీ ఉన్నప్పుడు వారి పర్సనల్ పీఏ అభ్యర్థన మేరకు అదనపు ట్యాంకర్లను పంపిస్తున్నట్లు తెలిపింది. గత ఐదేళ్లుగా ఇదే పద్ధతి కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇటీవల పైప్ లైన్ పూడిక వల్ల ఏర్పడిన తాత్కాలిక అంతరాయాన్ని కూడా వెంటనే సరిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్