TG: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 46.60 అడుగులకు చేరగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో 1.40 అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 10,78,490 క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు కొనసాగుతోంది. నీటి మట్టం పెరుగుతున్న నేపధ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.