ఖమ్మం(D) పాలేరు జలాశయం నుండి రెండో జోన్ కు నీటి విడుదల చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువ అండర్ టన్నెల్ నిర్మాణ పనులను పూర్తి చేసి సోమవారం నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. కూసుమంచి(M) జుజ్జులరావుపేటలో జరుగుతున్న పాలేరు సాగర్ కాలువ పనులను మంత్రి ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు.