TG: తమపై కోపం ఉంటే కేసులు పెట్టుకోవాలని, కానీ.. రైతుల కోసం కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు వదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మల్లాపూర్ సమావేశంలో మాట్లాడుతూ.. నీళ్లు వచ్చి రైతుల పంటలు పండితే ధాన్యం కొనాల్సి వస్తుందని నీళ్లు వదలట్లేదని విమర్శించారు. ఇంకో రెండేళ్లలో కేసీఆర్‌ను సీఎం చేసుకొని సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.