TG: పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు అందించాలని రైతులు కోరడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. సీతారామ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్లతో మాట్లాడారు. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల ఆలస్యం అవుతోందని అన్నారు. అందువల్లే సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. దీంతో ఇవాళ సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ అన్నారు.