కొచ్చిలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. కొట్టుకుపోయిన వాహనాలు

కేరళలోని ఎర్నాకుళం జిల్లా కొచ్చి సమీపంలోని తమ్మనం ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున కేరళ వాటర్ అథారిటీ (KWA)కి చెందిన ఫీడర్ ట్యాంక్‌ కూలిపోయింది. ఈ ప్రమాదం రాత్రి 2 గంటల నుండి 2.30 గంటల మధ్య చోటుచేసుకుంది. ఫలితంగా సుమారు 1.38 కోట్లు లీటర్ల నీరు ఒక్కసారిగా బయటకు రావడంతో పలు ఇళ్లు మునిగిపోయాయి. రహదారులపై నీరు చేరడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

సంబంధిత పోస్ట్