కేరళ వయనాడ్ లో జరిగిన ఘటనపై మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్నవారికి మానసిక ధైర్యాన్ని, మనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత అని చెప్పారు. అంత్యంత హృదయ విషాదకర ఘాటనతో ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నమైయ్యాయన్నారు. చేయి చేయి కలిపి కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందామని చెప్పారు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలునిచ్చారు.