టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ని జనవరి 6న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ సభ్యులతోపాటూ నిర్మాత దిల్ రాజు కూడా రానున్నట్లు సమాచారం.