విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా భారీగా కలెక్షన్లు సాధిస్తుంది. విడుదలైన 15 రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లకు చేరువైనట్లు నిర్మాణ సంస్థ 'X' వేదికగా తెలిపింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిందని ట్వీట్ చేశారు. సంక్రాంతికి విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ సినిమాగా ఇప్పటికి ఈ మూవీ చరిత్ర సృష్టించింది.