TG: మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోకాపేటలో రూ.1కే కోట్లాది విలువ చేసే భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధారాదత్తం చేసిందన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వర్క్స్ నిర్మిస్తున్న రిజర్వాయర్ కోసమే భూసమీకరణ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే మళ్లీ కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కడతారనే భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజల్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.