తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే సగానికిపైగా హామీలను నెరవేర్చామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద మొదటి దశలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.