TG: ఎల్నినో పరిస్థితులపై అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించినట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంపై ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, శాస్త్రవేత్తలు హెచ్చరించారని తెలిపారు. శాస్త్రవేత్తలు ఊహించినట్లుగానే పరిస్థితులు చేతులు దాటిపోయేటట్లున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తును ఎదుర్కొబోతున్నామని, ప్రజలు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రజల దైనందిన కార్యకలాపాలపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.