కొత్తగా 5 లక్షల రేషన్‌ కార్డులు ఇవ్వబోతున్నాం: ఉత్తమ్

TG: బీసీ రిజర్వేషన్‌ పై క్యాబినెట్‌ శనివారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల రేషన్‌ కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే 42 శాతం బీసీ రిజర్వేషన్‌‌తోనే రానున్న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సన్న బియ్యంతో రూ.3.10కోట్ల మందికి అన్నం పెడుతున్నామన్నారు. ఇక జులై 14న సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్