కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ చెల్లిస్తున్నాం: CM

TG: పంటలకు కనీస మద్దతు ధరతో పాటు సన్నవడ్లు పండిస్తే రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. '1.49 లక్షల ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్ల మేరకు రైతు భరోసా వేశాం. ఏడాది తిరిగేలోపు 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే రికార్డు సాధించాం. రైతు భరోసా, రుణమాఫీ, కనీస మద్దతు ధర, రేషన్ కార్డుఅమలు చేయడంతో తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్