TG: శాసనసభలో చర్చలకు ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం జరిగిన కృష్ణా గోదావరి జలాల మీటింగ్ అనంతరం వెల్లడించారు. నిపుణుల అభిప్రాయాలను కూడా శాసనసభ ద్వారా ప్రజలకు వినిపిద్దామని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల మీద ప్రజలకు అవగాహన కల్పించాలని, గత ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకషంగా చర్చిద్దామని తెలిపారు.