TG: రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని చంపిన కేసులో నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడని సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు. నిందితుడి కోసం 7 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. రాజ్ కుమార్ అర్ధరాత్రి షాబాద్ వెళ్లి బాలిక తల్లి, నాన్నమ్మను కత్తితో పొడిచి చంపాడని, బాలికను షాబాద్ నుంచి బలవంతంగా తీసుకెళ్లి దైవాలగూడ సమీపంలోని చెరువు వద్ద చంపేసినట్లు గుర్తించామన్నారు. పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని విడుదలైనట్లు తెలిపారు.