విమాన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం: రామ్మోహన్‌ నాయుడు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు విచారం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయానని గుర్తుచేశారు. వారి బాధను అర్థం చేసుకోగలనని చెప్పారు. ‘‘ఈ దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై విచారణకు తక్షణమే ఐదుగురు సభ్యుల కమిటీ వేశాం. బ్లాక్‌బాక్స్‌ విశ్లేషణ తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుంది’’ అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్