ఇరాన్‌పై దాడులు చేశాం: నెతన్యాహు (వీడియో)

ఇరాన్‌పై ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరుతో తీవ్రమైన దాడులను ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ వీడియోలో ప్రకటించారు. ఆ దేశ న్యూక్లియర్, బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్స్, శాస్త్రవేత్తలపై దాడులు చేశామన్నారు. "ఇరాన్ ఇప్పటికే 9 అణు బాంబులు తయారు చేయగలిగే యురేనియంను సమకూర్చుకుంది. ఈ ఉత్పత్తి పూర్తైతే టెర్రరిస్టులకు అణ్వాయుధాలు చేరే ప్రమాదం ఉంది. దాన్ని మేం అడ్డుకుంటున్నాం" అని చెప్పారు.

సంబంధిత పోస్ట్