రష్యా నుంచి చమురు కొనుగోలును అంత సులభంగా ఆపలేమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్లోబల్ సప్లై పరిస్థితులు, 140 కోట్ల మంది ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆమె సూచించారు. రష్యా నుంచి దిగుమతిని ఆపేస్తే ధరలు పెరిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. లభ్యత, అనుకూలత ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇంధన సేకరణను భారత్ కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.