కవితపై మల్లన్న వ్యాఖ్యలు ఖండిస్తున్నాం: TPCC చీఫ్

TG: కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే ఆయన ఆయన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి చట్ట వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి, గన్ మెన్ కాల్పులు జరిపిన అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ జరుగుతుందన్నారు. బీసీ బిల్లు, రిజర్వేషన్లు అన్ని కాంగ్రెస్ కృషి ఫలితమేనని.. ఈ అంశంలో ఇతరులు లబ్ది పొందాలని చూడడం సమంజసం కాదన్నారు.

సంబంధిత పోస్ట్