దేవుళ్లపై మనకు ఏకాభిప్రాయం లేదు: సీఎం రేవంత్(వీడియో)

TG: హిందువుల్లో మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారని.. ఒక్కో దేవుడిపై ఒక్కొక్కరికి ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. మంగళవారం గాంధీభవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారికి మరో దేవుడు ఉన్నాడు. మందు తాగేవాళ్లకు, పప్పన్నం, మాంసం తినేవాళ్లకూ దేవుళ్లు ఉన్నారు' అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనూ అన్ని రకాల మనస్తత్వాలు కలిగినవారు ఉంటారని ఆయన తెలిపారు. దేవుడిపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు పార్టీలో ఎలా ఉంటుందని సీఎం అన్నారు.

సంబంధిత పోస్ట్