‘విజయ్‌ పంపిన రూ.20 లక్షలు మాకొద్దు’

తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు టీవీకే అధ్యక్షుడు విజయ్ పంపిన రూ.20 లక్షల పరిహారాన్ని మృతుడు రమేశ్ భార్య సంఘవి తిరస్కరించారు. డబ్బు కంటే విజయ్ స్వయంగా వచ్చి పరామర్శించాలని ఆమె కోరారు. తమ బంధువులు తమ పేరుతో సమావేశానికి వెళ్లారని, తమ ఇష్టానికి విరుద్ధంగా జమచేసిన డబ్బును తిరిగి పంపినట్లు సంఘవి తెలిపారు.

సంబంధిత పోస్ట్