నియోజకవర్గంలో 3,250 డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించాం: సింగిరెడ్డి

TG: రైతు భరోసా కింద రూ.15 వేలు, ఆసరా పింఛన్లు రూ.4 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని BRS నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేశారు. మహిళలకు రూ. 2,500, ధాన్యంపై క్వింటాలుకు బోనస్ రూ. 500 ఎగ్గొట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు ఎన్నో ఆంక్షలు పెట్టి అర్హులకు అందకుండా చేస్తున్నారు. BRS హయంలో నియోజకవర్గంలో 3,250 డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాం' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్