AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తాజాగా వెల్లడించారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు.