BRS MLC కవితపై చర్యలు తీసుకోవాలంటూ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి MLC తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. సోమవారం గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన మల్లన్న.. తనపై కవిత గూండాలు తనపై దాడితో పాటు హత్యాయత్నం చేశారని. కవితపై చర్యలతో పాటు ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేయగా.. మల్లన్న కుడిచేతికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే.